కేటీఆర్ న్యాయవాదికి ఏసీబీ అనుమతి నిరాకరణ..! 1 d ago
బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, కేటీఆర్ ఏసీబీ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. న్యాయవాదులతో చర్చించిన తరువాత నందినగర్లోని తన నివాసం నుంచి ఆయన బయల్దేరారు. ఫార్ములా ఈ-రేస్ కేసులో ఏసీబీ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో సోమవారం విచారణ కోసం కేటీఆర్ వచ్చారు. ఏసీబీ ప్రధాన కార్యాలయం వద్ద తన న్యాయవాదిని పోలీసులు అడ్డుకోవడంపై కేటీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. పోలీసు ఉన్నతాధికారులు ఆయనతో మాట్లాడుతూ న్యాయవాదికి అనుమతి నిరాకరణపై రాతపూర్వకంగా ఇవ్వాలని తెలిపారు.